Senani News

ముంబై, నవంబరు 7 (సేనాని ప్రతినిధి): ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10 వేల ధరతో మూడేళ్ల వ్యాలిడిటీ కలిగిన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీర్ఘకాలం పాటు రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా వినియోగదారులకు నిరంతర కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. శనివారం నుంచి వినియోగదారులు ఈ ప్యాకేజీని పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనున్నారు. వీటితో పాటు అపరిమిత 5జీ డేటా సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో రోజువారీ ఇంటర్నెట్ అవసరాలు, ఫోన్ కాల్స్ కోసం ప్రత్యేకంగా మరో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
డేటా, కాలింగ్ సదుపాయాలతో పాటు పలు డిజిటల్ సేవలను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా అందిస్తున్నారు. జియోహాట్‌స్టార్ మొబైల్-హాలీవుడ్ ప్రయోజనం, 12 నెలల పాటు కాన్వా ప్రో లైట్ సభ్యత్వం, 50 జీబీ జియోఏఐక్లౌడ్ నిల్వ సదుపాయం ఇందులో ఉన్నాయి. వినోదం, సృజనాత్మక పనులు, ఆన్‌లైన్ సమాచార భద్రపరచడం వంటి అవసరాలకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
మొత్తంగా రూ.10 వేలతో మూడేళ్లపాటు మొబైల్ కనెక్టివిటీతో పాటు అదనపు డిజిటల్ సేవలను పొందేలా జియో ఈ ప్యాకేజీని రూపొందించింది. అయితే అపరిమిత 5జీ డేటా వినియోగానికి సంబంధించిన అర్హతలు, ఇతర నిబంధనలను రీఛార్జ్ చేసే ముందు పరిశీలించడం మంచిది.