– అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం
13 Oct 2025 (senani.net): రాజస్థాన్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహానికి దారితీసే కీలక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన గ్రౌండ్ బ్రేకింగ్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అదే విధంగా రూ.9,315 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలు నిర్వహించారు. కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనను కూడా అమిత్ షా ప్రారంభించారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణను వేగవంతం చేసి ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు మైలురాయిగా భావిస్తున్నారు. పెట్టుబడులు అమలులోకి వస్తే రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున లాభం చేకూరే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



