అమెజాన్‌ పేలో ప్రయాణ ఆఫర్లు.. విమాన టికెట్లపై 30 శాతం రాయితీ!

అమెజాన్‌ పేలో ప్రయాణ ఆఫర్లు.. విమాన టికెట్లపై 30 శాతం రాయితీ!

న్యూఢిల్లీ, నవంబరు 12 (సేనాని ప్రతినిధి): పండుగలు, సెలవుల సమయంలో ప్రయాణాలు చేయాలనుకునే వారికి అమెజాన్‌ పే శుభవార్త అందించింది. ‘ఇంపాజిబుల్‌ ట్రావెల్‌ డీల్స్‌ 2026’ పేరుతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాన్ని ప్రకటించింది. నవంబరు 12 నుంచి 26 వరకు 15 రోజుల పాటు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 30 శాతం వరకు, హోటల్‌ బుకింగ్‌లపై 65 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌, ముంబై నుంచి దుబాయ్‌, కోల్‌కతా నుంచి హో చి మిన్‌ సిటీ వంటి అంతర్జాతీయ మార్గాలతో పాటు ముంబై-గోవా, బెంగళూరు-కొచ్చి వంటి దేశీయ మార్గాల్లోనూ ఆకర్షణీయమైన ధరలకు విమాన టికెట్లు అందుబాటులో ఉంటాయి. దుబాయ్‌, సింగపూర్‌ సహా పలు ప్రముఖ నగరాల్లోని ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేసేందుకు కూడా ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.
క్యాష్‌బ్యాక్‌తో అదనపు ప్రయోజనాలు
అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగించే ప్రైమ్‌ సభ్యులకు 5 శాతం, ఇతర సభ్యులకు 3 శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. బస్సు టికెట్‌ బుకింగ్‌లపై 17 శాతం వరకు తగ్గింపుతో పాటు రూ.100 నగదు వాపసు పొందవచ్చు. నవంబరు 12, 13 తేదీల్లో ప్రారంభమయ్యే ముందస్తు ఆఫర్లలో విమాన టికెట్లపై గరిష్ఠంగా రూ.500, హోటల్‌ బుకింగ్‌లపై రూ.10 వేల వరకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనున్నారు.
24 గంటల కస్టమర్‌ సేవలు, తక్కువ రద్దు రుసుములు, ఇప్పుడే బుక్‌ చేసుకుని తర్వాత చెల్లించే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌, అనువర్తనంలోని ప్రయాణ విభాగం ద్వారా ఈ ఆఫర్లను పొందవచ్చని అమెజాన్‌ పే పేమెంట్స్‌ డైరెక్టర్‌ గిరీష్‌ కృష్ణన్‌ వెల్లడించారు.