ఆస్తి పన్ను విధానంపై ‘క్యూర్ చట్టం–2026’ సమీక్ష

* రెవెన్యూ సిబ్బందికి అవగాహన సమావేశం
* మూలధన విలువ ఆధారిత పన్ను విధానంపై వివరణ
* పన్ను లెక్కింపు, పునఃమదింపు ప్రక్రియలపై చర్చ
* అన్ని సర్కిళ్లలో అమలుపై కమిషనర్ సమీక్ష
సైబరాబాద్, నవంబర్ 10 (సేనాని ప్రతినిధి): క్యూర్ చట్టం–2026 అమలుపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రత్యేక అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కమిషనర్ (రెవెన్యూ), జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అన్ని సర్కిళ్లకు చెందిన రెవెన్యూ సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త చట్టంలోని నిబంధనలు, వాటి అమలు విధానం, ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించిన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించడమే సమావేశ ప్రధాన ఉద్దేశంగా సాగింది.
క్యూర్ చట్టం–2026లో పొందుపరిచిన ఆస్తి పన్ను నిబంధనలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇప్పటివరకు అనుసరిస్తున్న పద్ధతులతో పాటు మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను నిర్ధారించే విధానాన్ని వివరించారు. ఆస్తి విలువను ప్రాతిపదికగా తీసుకుని పన్ను ఎలా లెక్కించాలి, సంబంధిత వివరాలను ఎలా పరిశీలించాలి, నిబంధనల ప్రకారం పన్ను నిర్ధారణ ఎలా చేపట్టాలనే అంశాలను అధికారులకు వివరించారు. ఆస్తుల పునఃమదింపు ప్రక్రియపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. అవసరమైన సందర్భాల్లో ఆస్తుల వివరాలను తిరిగి పరిశీలించడం, పన్ను మొత్తాన్ని నిబంధనల ప్రకారం సవరించడం, సంబంధిత రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పన్ను లెక్కింపులో పారదర్శకత, ఏకరీతి విధానం పాటించేలా అన్ని సర్కిళ్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఇతర అంశాలపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. పన్ను వసూళ్ల ప్రక్రియ, ఆదాయ సేకరణకు సంబంధించిన విధానాలు, కొత్త నిబంధనల అమలులో ఎదురయ్యే అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రతి సర్కిల్లో చట్టంలోని నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని, రెవెన్యూ వ్యవహారాల్లో సమర్థత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూర్ చట్టం–2026 అమలులో అన్ని స్థాయిల అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని సమావేశంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఆస్తి పన్ను నిర్ధారణ నుంచి వసూళ్ల వరకు ప్రతి దశలో నిబంధనలను అనుసరించాలని, సర్కిళ్లవారీగా అమలు తీరును నిరంతరం పరిశీలించాలని కమిషనర్ సూచించారు. కొత్త విధానంపై రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించడం ద్వారా పన్ను నిర్వహణను మరింత క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు.