భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఊరట!

హైదరాబాద్, అక్టోబరు 31 (సేనాని ప్రతినిధి): బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు శనివారం భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,880గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే ఏకంగా రూ.3,880 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,27,300కు చేరింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.3,100 తగ్గుదల నమోదైంది.
తెలంగాణలో బంగారం ధరలు
తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,880 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,300గా ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,160గా నమోదైంది.
ఏపీ నగరాల్లోనూ ఇవే ధరలు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరాల్లోనూ పసిడి ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,880గా, 22 క్యారెట్ల ధర రూ.1,27,300గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,160గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, కేరళ, పుణె నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,880గా ఉంది. ఢిల్లీలో మాత్రం రూ.1,39,030గా, వడోదరాలో రూ.1,38,930గా నమోదైంది. ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో స్థానిక ఆభరణాల దుకాణాల్లోని ధరలు, తరుగు, తయారీ ఛార్జీలు, పన్నులను కూడా పరిశీలించాలి.