సేనాని (senani.net): October 23, 2025 : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు చేరువైంది. గురువారం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టి న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.. దీంతో ఈ టోర్నీలో చివరిదైన నాలుగో సెమీస్ బెర్తును భారత జట్టు ఖరారు చేసుకుంది. ఈ ఫలితంతో న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు ఇప్పటికే సెమీస్ చేరాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ రాణించింది.



