కియా కార్లపై రూ.1.70 లక్షల వరకు రాయితీలు

న్యూఢిల్లీ, నవంబరు 8 (సేనాని ప్రతినిధి): దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై గరిష్ఠంగా రూ.1.70 లక్షల వరకు రాయితీలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. కార్నివాల్పై రూ.లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాల కింద రూ.50 వేల వరకు అందిస్తున్నట్లు వెల్లడించింది.
కారెన్స్ క్లావిస్ టర్బోపై రూ.95 వేల వరకు, సోనెట్ హెచ్టీకేపై రూ.65 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. సైరోస్, సెల్టోస్, సోరెంటో, కారెన్స్ క్లావిస్ ఈవీ మోడళ్లపై కూడా రూ.లక్ష వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
కారెన్స్ క్లావిస్ టర్బో కొనుగోలుపై రూ.10 వేల వరకు నగదు రాయితీతో పాటు రూ.30 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లతో పండుగ సీజన్లో కార్ల కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కియా ప్రయత్నిస్తోంది. మోడల్, వేరియంట్, డీలర్ ఆధారంగా ఆఫర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది.