ఒక్కరోజే రూ.6,110 పెరిగిన బంగారం ధర!

ఒక్కరోజే రూ.6,110 పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్‌, నవంబరు 5 (సేనాని ప్రతినిధి): ధనత్రయోదశి పండుగ వేళ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరలు షాక్‌ ఇస్తున్నాయి. పండుగకు ముందు పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గురువారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,020కు చేరింది. బుధవారం ఇదే ధర రూ.1,39,910గా ఉండగా.. ఒక్కరోజులోనే రూ.6,110 పెరగడం గమనార్హం. గురువారం ఉదయం 7 గంటలకు నమోదైన రూ.1,42,810తో పోల్చినా మూడు గంటల్లో రూ.3,210 పెరిగింది.
22 క్యారెట్ల ధర ఎంతంటే?
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,850గా నమోదైంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,09,520గా ఉంది. తెలంగాణలోని వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఏపీ నగరాల్లోనూ అవే ధరలు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,020గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,33,850 కాగా.. 18 క్యారెట్ల ధర రూ.1,09,520గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,170గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,34,000, 18 క్యారెట్ల ధర రూ.1,09,670గా ఉంది. చెన్నైలో 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,550గా నమోదైంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణె నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,46,020, 22 క్యారెట్ల ధర రూ.1,33,850గా ఉంది.
పండుగ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో ధరల పెరుగుదల కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అయితే నగలు కొనుగోలు చేసేటప్పుడు ఆభరణాల తయారీ రుసుములు, పన్నులు కలిపి తుది ధర మారుతుందని గమనించాలి.