రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ శేఖర్ మాస్టర్!

హైదరాబాద్, నవంబరు 12 (సేనాని ప్రతినిధి): ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన బృందంలోని సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా చిత్రీకరణ ముగించుకుని శేఖర్ మాస్టర్, ఆయన బృందం హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముచ్చింతల్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును పండ్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.