14 Oct 2025 (senani.net): దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఆంధ్ర జట్టు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ పోరులో పాల్గొనే జాబితాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈసారి రికీ భుయ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. యంగ్ టాలెంట్‌తో పాటు అనుభవజ్ఞుల సమ్మేళనంగా జట్టును ఎంపిక చేయడం విశేషం. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది. మొదటి నుంచే విజయం లక్ష్యంగా జట్టు సన్నద్ధం అవుతోంది. గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన %ఖూ% భరత్ మళ్లీ జట్టులో చోటు పొందడం జట్టుకు బలాన్నిస్తోంది. అతని అనుభవం, వికెట్‌కీపింగ్ నైపుణ్యం, మధ్య వరుసలో నిలదొక్కుకోవడంలో కీలకం కానుంది. యువ ఆటగాళ్లైన రషీద్, కరణ్ షిండే వంటి వారు ఈ సీజన్‌లో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో శశికాంత్, పృథ్వీరాజ్, స్టీఫెన్‌లపై భారీ బాధ్యత ఉంటుంది. స్పిన్‌లో సౌరభ్ కుమార్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. జట్టు సమతుల్యంగా ఉండటంతో ఆంధ్ర అభిమానుల్లో మంచి ఆశలు మొదలయ్యాయి.
ఆంధ్ర రంజీ జట్టు ఈ విధంగా ఉంది:
కెప్టెన్: రికీ భుయ్
సభ్యులు: భరత్, అభిషేక్ రెడ్డి, రషీద్, కరణ్ షిండే, రాజు, శశికాంత్, సౌరభ్ కుమార్, పృథ్వీరాజ్, విజయ్, ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, సాయితేజ, స్టీఫెన్,సందీప్. ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టు ఎలా రాణిస్తుందోనన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది.



 
                                    