– చైనాను ఎదుర్కోవాలంటే భారత్ అవసరం అని అమెరికా స్పష్టం
– అరుదైన ఖనిజాలపై చైనా నియంత్రణ.. అమెరికాకు భారత్ సహాయం తప్పనిసరి
– చైనా ఆర్థిక యుద్ధానికి భారత్ కీలక మిత్రదేశమని స్కాట్ బెసెంట్ కామెంట్స్
– ప్రపంచ ఆర్థిక సమీకరణల్లో భారత్ పాత్ర పెరుగుతోందని అమెరికా అంగీకారం
15 Oct 2025 (senani.net):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, భారత్ తన ఇంధన వ్యూహంలో మార్పు చేయకుండా రష్యా నుంచే భారీ ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ కెప్లర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 సెప్టెంబర్ నెలలో భారత్ దిగుమతి చేసిన మొత్తం ముడి చమురులో 34 శాతం వరకు రష్యా వాటాగా నమోదైంది. దీంతో రష్యా భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా తన స్థానాన్ని కొనసాగించింది.
సెప్టెంబర్ నెలలో రోజుకు సగటున 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. రష్యా తర్వాత ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు వరుసగా భారత్‌కు చమురు సరఫరా చేసిన దేశాలుగా ఉన్నాయి. అమెరికా ఒత్తిడిని పక్కన పెట్టి భారత్ తన ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ వ్యూహం అంతర్జాతీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్శిస్తోంది. ఆగస్టు నెలతో పోల్చితే సెప్టెంబర్‌లో రష్యా నుంచి చమురు దిగుమతులు స్వల్పంగా తగ్గినట్లు కెప్లర్ గణాంకాలు సూచిస్తున్నాయి. రోజుకు సుమారు 1,80,000 బ్యారెళ్ల మేర కొనుగోళ్లు తగ్గినా, దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో వచ్చిన మార్పులేనని నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా హెచ్చరికలతో ఈ తగ్గుదలకు సంబంధం లేదని స్పష్టంగా తెలిపారు.
గత కొంతకాలంగా భారత్ రష్యా ఇంధన వాణిజ్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. కేవలం జులై నెలలోనే రష్యా భారత్‌కు 3.6 బిలియన్ డాలర్ల విలువైన చమ ్నను విక్రయించింది. ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, భారత్ తన ఇంధన స్వావలంబన లక్ష్యాన్ని కచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నదని ఈ గణాంకాలు చూపుతున్నాయి. భారత్‌కు చమురు సరఫరాలో రష్యా ప్రాధాన్యం పెరగడం వెనుక మరో ముఖ్య కారణం తగ్గించిన ధరలే అని ఇంధన విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ రేట్ల కంటే తక్కువ ధరకు రష్యా చమురును ఆఫర్ చేయడంతో, భారత రిఫైనరీలు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, రష్యా నుంచి నేరుగా లేదా మూడో దేశాల ద్వారా చమురు కొనుగోళ్లు కొనసాగించడం భారత్‌కు ఆర్థికంగా లాభదాయకంగా మారుతోంది. దేశీయ ఇంధన అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ధరల సరఫరా భారత్‌కు పెద్ద ఉపశమనం అందిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన విదేశాంగ, వాణిజ్య విధానాల్లో సమతుల ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, మరోవైపు రష్యాతో ఇంధన సహకారాన్ని బలపరచడం ద్వారా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటోంది. అంతర్జాతీయ ఒత్తిడులను దాటుకుని స్వదేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న భారత్ నిర్ణయాన్ని అనేక దేశాలు గమనిస్తున్నాయి.



