Thursday, October 30, 2025
Director & Co-founder: Mr. K. Subramanyam P
Chief Editor & CEO : Mr.M Lakshmi Narayana
Founder, Chairman & MD : Mr. Mallanna P
Editor : Miss Deepa P
Google search engine
Homeక్రీడలుసేనాని (senani.net): జడేజా ప్రశ్నలు.. గిల్‌, గంభీర్‌పై సూచనలు

సేనాని (senani.net): జడేజా ప్రశ్నలు.. గిల్‌, గంభీర్‌పై సూచనలు

Google search engine

14 Oct 2025 (senani.net): వెస్టిండీస్‌పై టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో గెలవగా, ఈ సిరీస్‌లో రవీంద్ర జడేజా తన అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇది అతని కెరీర్‌లో మూడోసారి వచ్చిన ఘనత. అయితే అవార్డు తీసుకున్న వెంటనే జడేజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రత్యేకంగా కెప్టెన్‌ శుభ్‌మాన్‌ గిల్‌, మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ నిర్ణయాలపై అతను పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపించింది. జడేజా మాట్లాడుతూ, లిలి‘‘నాకు ఇంకాస్త బౌలింగ్‌ చేసే అవకాశాలు రావాలిలిలి. అశ్విన్‌ పదవీ విరమణ తర్వాత జట్టులో నాకు ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుందని భావించాను. కానీ నాకు ఆశించిన స్థాయిలో బౌలింగ్‌ ఓవర్లు దొరకలేదు. అయినప్పటికీ మన జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా మొత్తం మీద బలంగా కనిపిస్తోంది. గత ఆరు నెలల్లో జట్టు కనిపిస్తున్న తీరు సంతృప్తినిచ్చేలా ఉంది’’ అని స్పష్టం చేశాడు. అంతేకాదు, గౌతమ్‌ గంభీర్‌ తనను లిలి6వ స్థానంలో బ్యాటింగ్‌ చేసే పాత్రకు నిలిపారని వెల్లడిస్తూలిలి, తన మైండ్‌సెట్‌ కూడా మారిందని అన్నాడు. ‘‘ఇప్పుడు నేను స్వచ్ఛమైన బ్యాట్స్‌మన్‌లాగా ఆలోచిస్తున్నాను. గతంలో 7 లేదా 8వ స్థానంలో ఆడినప్పుడు నా ఉద్దేశ్యం వేగంగా రన్స్‌ చేయడమే. కానీ ఇప్పుడు క్రీజులో ఎక్కువసేపు నిలవాలని చూస్తున్నాను. నేను వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకు ఉపయోగపడే రన్నుల కోసమే ఆడుతాను’’ అని జడేజా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో జడేజా తన బౌలింగ్‌ అవకాశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటులిలి, గిల్‌ కెప్టెన్సీ నిర్ణయాలు, గంభీర్‌ వ్యూహాలపై కూడా పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సిరీస్‌లో బ్యాట్‌తో 104 పరుగులు సాధించడమే కాకుండా, ఎనిమిది వికెట్లు కూడా తీశాడు. మొదటి టెస్ట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన అతను, ఇప్పటి వరకు మొత్తం 11 సార్లు ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో భారత్‌కు నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచిన జడేజా, తన పాత్ర ఇంకా విస్తరించాలని సూచించిన ఈ వ్యాఖ్యలతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై తనదైన ఒత్తిడి సృష్టించాడు అనడం అతిశయోక్తి కాదు.

Google search engine
RELATED ARTICLES
Google search engine
- Advertisment -
Google search engine

Most Popular

Google search engine