14 Oct 2025 (senani.net):‘ప్రేమలు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ నటి మమిత బైజు ఇప్పుడు మరో ఆసక్తికరమైన పాత్రతో రాబోతుంది. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ సరసన కథానాయికగా నటిస్తూ తెరపై కనిపించనుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా విడుదలకు ముందు మమిత తన పాత్ర విశేషాలను పంచుకుంది. దర్శకుడు కీర్తిశ్వరన్ నుంచి కథ విన్న వెంటనే అంగీకరించానని ఆమె తెలిపింది. ఇందులో తాను లిలి‘కురల్’లిలి అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. లిలి‘‘కురల్ చాలా నిజాయితీపరురాలు. అందరితో స్పష్టంగా, ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అంతేకాదు, కథలో ఆ పాత్రకి కీలక ప్రాధాన్యం ఉంటుంది. నేను ఇంతకు ముందు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర చేయలేదు. అందుకే ఇది నాకు ఓ సవాలు’’లిలి అని మమిత చెప్పింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం రాత్రంతా ప్రాక్టీస్ చేసి, తదుపరి రోజు షూట్‌కు సన్నద్ధమయ్యేదాన్ని అని చెప్పిన ఆమె, లిలి‘‘నాకు ప్రతి సీన్‌కి ప్రిపరేషన్ తప్పనిసరి. పాత్రలో పూర్తిగా లీనమవ్వాలని ప్రయత్నిస్తాను’’లిలి అని తన పని తీరును వివరించింది. ఈ సినిమా యూత్‌కు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, భావోద్వేగాలతో కూడిన లవ్ డ్రామాలా ఉంటుందని యూనిట్ చెబుతోంది. సినిమా మీద ఇప్పటికే హైప్ ఏర్పడగా, మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాణం కావడం సినిమాపై మరింత ఆశలు పెంచుతోంది. అన్ని కళ్లూ ఇప్పుడు అక్టోబర్ 17పై ‘డ్యూడ్’లో కురల్ మమిత ఏం చూపిస్తుందో చూడాల్సిందే!



