– భారత.. కెన్యా స్నేహాన్ని మోదీతో సమన్వయం చేసిన ఒడిరగా
– ఆయుర్వేద ఆకర్షణతో మోదీని మన్నించిన ఒడిరగా
– కెన్యా మాజీ ప్రధాన మంత్రికి మోదీ నివాళి
15 Oct 2025 (senani.net):కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడిరగా గారి మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఒడిరగా గారితో తన స్నేహం మొదలై, ఆ అనుబంధం ఏళ్ల తరబడి కొనసాగిందని మోదీ గుర్తుచేసుకున్నారు. భారతదేశం పట్ల ఒడిరగా గారికి ఉన్న మమకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ, ఆయన భారత సంస్కృతి, విలువలు, ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల చూపిన ఆకర్షణను అభినందించారు. భారత.. కెన్యా సంబంధాలు బలపడే దిశగా ఒడిరగా గారు చేసిన కృషిని గుర్తుచేసుకున్న మోదీ, ఆయన నిజమైన అంతర్జాతీయ మిత్రుడని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలాంటి భారతీయ సంప్రదాయ వైద్య విధానాలపై ఆయన విశ్వాసం, తన కుమార్తె చికిత్స సందర్భంగా పొందిన అనుభవంతో మరింత గాఢమైందని మోదీ తెలిపారు. భారతదేశం అందించే జ్ఞానం ప్రపంచానికి ఉపయోగపడాలనే ఒడిరగాగారి కోరికను ఆయన స్మరించుకున్నారు.
రైలాగారి మరణంతో కెన్యా మాత్రమే కాదు, భారతదేశం కూడా తనకు దగ్గరైన ఓ నిజమైన మిత్రుడిని కోల్పోయిందని మోదీ అన్నారు. ఇంతటి ప్రజానాయకుడిని కోల్పోవడం అంతర్జాతీయ రాజకీయ రంగానికి కూడా పెద్ద లోటు అని భావవ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు, కెన్యా ప్రజలకు భారతదేశం తరఫున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మోదీ ప్రకటించారు.
రైలా ఒడిరగా గారి వ్యక్తిత్వంలో ఓ ప్రత్యేకమైన ఆత్మీయత ఉండేది. రాజకీయంగా ఎంత పెద్దస్థానంలో ఉన్నా, వ్యక్తిగతంగా కలిసిన ప్రతి ఒక్కరినీ స్నేహపూర్వకంగా ఆదరించడం ఆయన స్వభావం. అభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే విధానాలే నిజమైన నాయకత్వమని ఆయన నమ్మకం. అందుకే ఆయన నిర్ణయాల్లో మానవ విలువలు స్పష్టంగా కనిపించేవి. రాజకీయ విజయాలను మించినది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడమేనని ఆయన జీవితం తెలియజేస్తుంది. ప్రపంచంలో దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలనే దృక్పథం ఆయనది. భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని కూడా అలాంటి హృదయపూర్వక దృష్టితోనే చూసేవారు. సాంకేతిక విజ్ఞానం నుండి సంప్రదాయ చికిత్సా విధానాల వరకు భారతదేశం అందించిన సహకారానికి ఆయన ఇచ్చిన గౌరవం మన దేశం పట్ల ఆయనకున్న నిజమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. రైలా ఒడిరగా గారి జ్ఞాపకం భారత%-%కెన్యా సంబంధాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.



