15 Oct 2025 (senani.net): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ రాబోతుంది. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సలార్ పార్ట్ 1 %-% సీజ్ఫైర్ మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించి హోంబలే ఫిలిమ్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే సినిమాను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ మాత్రమే కాకుండా ప్రభాస్ నటించిన ఈశ్వర్, మిస్టర్ పర్ఫెక్ట్, పౌర్ణమి వంటి చిత్రాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.



