14 Oct 2025 (senani.net):న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్ తన ఖాతాలో కొత్త రికార్డు వేసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత తొలిసారి ఓ సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కెప్టెన్‌గా రెండో సిరీస్‌లోనే అతను విజయాన్ని తన రికార్డుల్లోకి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా సారథ్య బాధ్యతలను గిల్ చేపట్టాడు. విదేశీ గడ్డపై జరిగిన ఆ సిరీస్ 2-2 తేడాతో సమం అయ్యింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ క్రికెటర్టు టెస్టు క్రికెట్‌కు దూరం కావడంతో.. వారి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ తన సారథ్య లక్షణాలతో ఆకట్టుకున్నాడు. ప్రధాన బ్యాటర్‌గా రాణించడంతో పాటు జట్టులోని ప్లేయర్లను మేనేజ్ చేసిన విధానంలోనూ గిల్ సక్సెస్ అయ్యాడు. విండీస్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ మీడియాతో మాట్లాడారు. కెప్టెన్సీని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించే విధానాన్ని అలవరుచుకుంటున్నట్లు తెలిపారు. ఆటగాళ్లను ఎలా మ్యానేజ్ చేయాలన్న అంశాలను కూడా నేర్చుకున్నట్లు చెప్పారు. మ్యాచ్ పరిస్థితికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకం అన్నారు. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 300 పరుగల ఆధిక్యంలో ఉన్నామని, పిచ్ చాలా నిర్జీవంగా ఉందని, అందుకే ఫాలోఆన్ ఆడిరచామన్నారు. స్పీడ్ బౌలింగ్ వేసే ఆల్‌రౌండర్లు విదేశీ పిచ్‌లపై అవసరం ఉంటుందని, అందుకే నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్యాటర్‌గా నిర్ణయాలు తీసుకుంటానని, కానీ కెప్టెన్‌గా కాదన్నారు. చిన్నతనం నుంచే జట్టును గెలిపించే తత్వాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో ఇండియా స్వీప్ చేసింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చేతుల మీదుగా కెప్టెన్ శుభమన్ గిల్ ట్రోఫీని అందుకున్నారు. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనక కనబరిచిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. ఓ టెస్టు మ్యాచ్‌లో జడేజా సెంచరీ చేశాడు. ఇక రెండు మ్యాచుల్లో కలిపి అతను 8 వికెట్లు కూడా తీసుకున్నాడు. అహ్మదాబాద్ ఇన్నింగ్స్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కిందతనికి. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు. కోచ్ గౌతం గంభీర్ తనకు అవకాశం కల్పించినట్లు జడేజా పేర్కొన్నాడు. ఇక ఢల్లీిలో జరిగిన రెండో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కుల్దీప్ యాదవ్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో అతను 8 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసుకున్నాడతను. అహ్మదాబాద్ టెస్టుతో పోలిస్తే ఇది భిన్నమైన వికెట్ అని అన్నాడు. ఎక్కువ సంఖ్యలో ఓవర్లు వేయడం ఓ ఛాలెంజ్ అని, దాన్ని ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. ఢల్లీి పిచ్‌పై పెద్దగా స్పిన్ లేదని, వికెట్ డ్రైగా ఉందన్నాడు. బ్యాటర్లను ఔట్ చేయడం ఆనందాన్నిస్తుందన్నాడు. కీలక సమయాల్లో జడేజా తనకు సహకరించినట్లు చెప్పాడు.



