Home సినిమా సేనాని (senani.net): చీరకట్టులో మెరిసిన అను ఇమ్మాన్యుయేల్‌

సేనాని (senani.net): చీరకట్టులో మెరిసిన అను ఇమ్మాన్యుయేల్‌

0
Senani (senani.net): Anu Emmanuel shines in a saree
Senani (senani.net): Anu Emmanuel shines in a saree

15 Oct 2025 (senani.net): చీరకట్టులో చిలకమ్మలా మెరిసిన అను ఇమ్మాన్యుయేల్‌.. నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, తొలి సినిమా నుంచే కుర్రకారులో క్రేజ్‌ క్రియేట్‌ చేసింది. ఆ అమాయక చూపులు, స్మైల్‌తో స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారి ఈమె ఫోటో కట్‌అవుట్లు సోషల్‌ మీడియాలో తిరిగాయి. మజ్ను తర్వాత కూడా ఆమె పేరు అభిమానుల నోట తిరిగిన తీరు ప్రత్యేకం. అనంతరం మలయాళంలో యాక్షన్‌ హీరో బిజు అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశమొచ్చింది. అదే సంవత్సరం తెలుగులో మజ్ను విడుదల కావడంతో రెండు ఇండస్ట్రీల్లో గుర్తింపు సంపాదించింది. నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మాయి, తన అందంతో యువతను తనవైపు తిప్పుకుంది. ప్రతి స్టిల్‌, ప్రతి పబ్లిక్‌ అప్పియరెన్స్‌ ట్రెండ్‌గా మారింది. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య సినిమాలు చేసినా అవి ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తుప్పరివాలన్‌, నమ్మ వీట్టు పిళ్లై చిత్రాలు ఆమెకు మంచి రీచ్‌ తీసుకొచ్చాయి. సోషల్‌ మీడియాలో అయితే ఈమెకు ప్రత్యేక ఫాలోయింగ్‌ ఏర్పడిరది. చాలా రోజులుగా సినిమాల్లో తగ్గి కనిపిస్తున్నా, సోషల్‌ మీడియాలో మాత్రం అను ఇమ్మాన్యుయేల్‌ పోస్టులు కుర్రకారికి ఫేవరెట్‌ కంటెంట్‌గా మారాయి. ఇటీవల చీర ధరించి పెట్టిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆ లుక్‌లో ఆమె సంప్రదాయం, అందం కలిసిన అట్ట్రాక్షన్‌గా మెరిసింది. అభిమానులు చిలకమ్మలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version