Home ఇంకా సేనాని (senani.net): టాటా మోటార్స్‌ షేరు 40 శాతం పతనమైందా

సేనాని (senani.net): టాటా మోటార్స్‌ షేరు 40 శాతం పతనమైందా

0
Senani (senani.net): Has Tata Motors stock fallen 40 percent?
Senani (senani.net): Has Tata Motors stock fallen 40 percent?

15 Oct 2025 (senani.net):టాటా మోటార్స్‌ షేరు ధర సోమవారం రూ.660.75 వద్ద ముగిసింది. మంగళవారం ఉదయం ఈ షేరు ట్రేడిరగ్‌ రూ.399 వద్ద ఆరభమైంది. అంటే, ధర అమాంతం 40 శాతం తగ్గింది. ఎందుకంటే, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ (పీవీ), వాణిజ్య వాహన (సీవీ) వ్యాపారాలను రెండు ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీలుగా విభజించింది. ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తదనుగుణంగా కంపెనీ షేర్లలో సర్దుబాటు మంగళవారం చోటు చేసుకుంది. ఈ సర్దుబాటులో భాగంగా ప్యాసింజర్‌ వాహన వ్యాపారంతో కూడిన టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీఎల్‌) షేరు ధరను రూ.400గా గంటపాటు నిర్వహించిన ప్రత్యేక ప్రీ-మార్కెట్‌ సెషన్‌ ద్వారా నిర్ణయించారు. దాంతో రూ.399 వద్ద ట్రేడిరగ్‌ ఆరంభించిన ఈ షేరు ఒక దశలో రూ.421 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి రూ.395.50 వద్ద ముగిసింది. కాగా వ్యాపార విభజన ప్రణాళికలో భాగంగా, మంగళవారం నాటికి టాటా మోటార్స్‌ షేర్లు కలిగిన ఇన్వెస్టర్లకు. తాము కలిగి ఉన్న ఒక్కో షేరుకు గాను ఒక టీఎంఎల్‌సీవీ షేరును సంస్థ కేటాయించనుం ది. తద్వారా రెండు లిస్టెడ్‌ కంపెనీల స్టాక్స్‌ లభించనున్నాయి. అయితే, టీఎంఎల్‌సీవీ షేర్లన్లు లిస్ట్‌ చేసేందుకు మరో 4-6 వారాలు పట్టవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version