Home ఆంధ్రప్రదేశ్ సేనాని (senani.net): కాంట్రాక్టు సిబ్బంది విలీనంపై స్పష్ట నిర్ణయం కావాలి : షర్మిల

సేనాని (senani.net): కాంట్రాక్టు సిబ్బంది విలీనంపై స్పష్ట నిర్ణయం కావాలి : షర్మిల

0
Senani (senani.net): A clear decision is needed on the merger of contract staff: Sharmila
Senani (senani.net): A clear decision is needed on the merger of contract staff: Sharmila

– కాంగ్రెస్‌ మద్దతు.. సమ్మెపై స్పష్టమైన వైఖరి
– ప్రభుత్వం చర్చలకు రావాలని షర్మిల డిమాండ్‌
– పెండిరగ్‌ డీఏలు, వైద్య సదుపాయాల అమలుకు ఒత్తిడి
14 Oct 2025 (senani.net): ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొంటూ, ప్రభుత్వం చూపుతున్న మొండి ధోరణి వల్లే ఈ స్థితి ఏర్పడిరదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులను అణగదొక్కడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికే 58 సార్లు చర్చలు జరిగినా సమస్య పరిష్కారం చేపట్టకపోవడం బాధాకరమని షర్మిల మండిపడ్డారు. 63 వేల మంది ఉద్యోగులు ఆవేదనతో సమ్మెకు దిగాల్సి రావడం ప్రభుత్వ ఆరోపణలు కాదు, ప్రభుత్వ వైఫల్యమని ఆమె విమర్శించారు. ఉద్యోగుల జేఏసీ నేతలను వెంటనే చర్చలకు ఆహ్వానించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా 25 ఏళ్లుగా పనిచేస్తున్న 27 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని సంస్థలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. కారుణ్య నియామకాలను పాత విధానంలోనే కొనసాగించి, 7500 మంది జూనియర్‌ లైన్‌మన్‌లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలని సూచించారు. ఉద్యోగుల కుటుంబాలకు అపరిమిత వైద్య సదుపాయం అందించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయకూడదని విజ్ఞప్తి చేశారు అదనంగా, పెండిరగ్‌లో ఉన్న 4 డీఏ/డీఆర్‌లను వెంటనే విడుదల చేసి, విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమం కొనసాగితే విద్యుత్‌ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ఉద్యోగుల ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ప్రకటించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version