Home ఆరోగ్యం సేనాని (senani.net): రాత్రిళ్లు పాదాలు చల్లగా మారుతున్నాయా?

సేనాని (senani.net): రాత్రిళ్లు పాదాలు చల్లగా మారుతున్నాయా?

0
Senani (senani.net): Are your feet getting cold at night?
Senani (senani.net): Are your feet getting cold at night?

14 Oct 2025 (senani.net):రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగితే, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగితే ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టడం ఎలా? ఏయే లక్షణాలు కన్పిస్తాయి? వంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పాదాలలో చెడు కొలెస్ట్రాల్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగినట్లయితే పాదాలలోని ఈ కింది లక్షణాల ద్వారా చెప్పవచ్చు.రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగితే ప్రారంభ లక్షణం.. కొంచెం నడిచినా లేదా కొంచెం ఎక్కువ పని చేసినా శ్వాస ఆడకపోవడం. అయితే, శ్వాస ఆడకపోవడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. అందువల్ల, రక్త పరీక్ష లేకుండా కొలెస్ట్రాల్‌ పెరిగిందనే నిర్ధరణకు రాకూడదు.రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగితే పాదాలలో చాలా సమస్యలు వస్తాయి. వీటి ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగిందో లేదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే రాత్రిపూట పాదాలు చల్లగా మారుతాయి. శీతాకాలం, వేసవి, వర్షాకాలం అయినా.. అన్ని సీజన్లలో దాదాపు రాత్రిపూట పాదాలు చల్లగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మీ రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగిందని సంకేతం. అలాగే కాలి చీలమండల్లో ఆకస్మిక వాపు కనిపించినా విస్మరించవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా రక్త పరీక్ష చేయించుకోవాలి. చాలా మందికి అరికాళ్లలో మంట వస్తుంది. సాధారణంగా శరీరంలో పిత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అయితే రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరుగుదల వల్ల కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి దీనిని తేలిగ్గా తీసుకోకూడదు. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం వల్ల కాళ్లలోని నరాలు దెబ్బతింటాయి. ఇది పాదాలలో నరాలు, పాదాల అరికాళ్ళు, కాలి వేళ్ళలో అస్థిరతకు దారితీస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలలో ఇది ఒకటి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version