14 Oct 2025 (senani.net):ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. డ్రై ప్రూట్స్ వల్ల విటమిన్లు అందుతాయి.కానీ అందులో కొన్ని తినడం వల్ల మాత్రం కొందరికి మేలు జరగదు అంటున్నారు నిపుణులు. ఇక పిస్తా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ పిస్తాను ఎవరు తినాలి? ఎవరు తినకూడదు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిస్తా పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, విటమిన్ దీ6, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. దీంతో అలసట, బలహీనతకు చెక్ చెప్పవచ్చు. ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు పిస్తా పప్పు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరు తినకూడదు అంటే.. ఇటీవల కిడ్నీ సమస్యల కేసులు పెరుగుతున్నాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం అనేది సర్వసాధారణమైంది. ఇలాంటి వారు కూడా పిస్తా పప్పులు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఆక్సలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది. దీన్ని తినడం వల్ల కిడ్నీల్లో రాల్లు రావడం లేదా కిడ్నీల పని తీరు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత టెక్ యుగంలో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరిగింది అనేది కాదనలేని వాస్తవం. పేలవ జీవనశైలి కారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు పిస్తా పప్పులు తినకూడదు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును మరింత పెంచుతాయి. కొందరు రెగ్యూలర్ గా మందులు వాడుతుంటారు. అలాంటి వారు కూడా ఈ పిస్తాను తినకపోవడమే బెటర్. ఎందుకంటే ఇవి మందులతో చర్య జరిపి శరీరంపై దుష్ప్రభావాలు కలిగిస్తాయి. పిస్తాలను తినాలనుకుంటే ముందు జాగ్రత్తగా డాక్టర్‌ను సంప్రదించడం బెటర్. చాలా మందికి తినే ఆహారంపై సరైన అవగాహన ఉండటం లేదు. జంక్, స్పైసీ, ఫ్రైడ్, ప్యాక్డ్ ఫుడ్స్ అతిగా తింటున్నారు. దీంతో పొట్ట ఆరోగ్యం దెబ్బతిని జీర్ణ సమస్యలు తలెత్తున్నాయి. అయితే జీర్ణ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పులు తినకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా అజీర్ణం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల రిస్క్ పెరుగుతుంది. నట్స్, సీడ్స్ కొందరికి పడవు. వీటిని తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి, జీర్ణం అవడం కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ పిస్తా శరీరానికి వేడిని కలిగిస్తూ దురద వంటి చర్మ సమస్యలకు కారణం అవుతుంది కాబట్టి కాస్త జీర్ణ సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండటం బెటర్.. ఒకవేళ తినాలనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది అని గుర్తు పెట్టుకోండి. పిల్లలు కూడా వీటికి దూరంగా ఉండటం బెటర్. కొందరు సరిగ్గా నమలకుండానే తింటారు. దీంతో మింగేటప్పుడు పిస్తా లేదా దాని ముక్క గొంతులో ఇరుక్కుపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాదు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లలకు పిస్తాలు ఇవ్వకపోవడం మంచిది.
