Home సినిమా సేనాని (senani.net): యూనిక్‌ కథతో ‘మేఘన’

సేనాని (senani.net): యూనిక్‌ కథతో ‘మేఘన’

0
Senani (senani.net): ‘Meghana’ with a unique story
Senani (senani.net): ‘Meghana’ with a unique story

14 Oct 2025 (senani.net):‘చిత్రం’ శ్రీను, సుష్మ, రామ్‌ బండారు హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మేఘన’. సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహించారు. శ్రీ శివ సాయి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నంది వెంకట్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర పోస్టర్‌, టీజర్‌ లాంచ్‌ వేడుక ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో ‘చిత్రం’ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నా ఖాతాలో మరో హిట్‌ పడు తుందని కచ్చితంగా చెప్పగలను. నాకు అవ కాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని అన్నారు. ‘ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న చనిపోయి మూడేళ్లు అవుతోంది. ఆ తర్వాత నేను ఎప్పుడూ బర్త్‌డే సెలబ్రేట్‌ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రెస్‌మీట్‌ సందర్భంగా పుట్టినరోజు జరుపు కోవడం ఎంతో భావోద్వేగంగా, ఆనందంగా అనిపించింది. ఈ మూవీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాబోతుంది’ అని హీరోయిన్‌ సుష్మ చెప్పారు. దర్శకుడు సుధాకర రెడ్డి వర్ర మాట్లాడుతూ, ‘చిన్న ప్రొడక్షన్‌ అయినా పెద్ద కలలతో ఈ సినిమా చేశాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, కేవలం రెండేళ్లలోనే చిత్రాన్ని పూర్తి చేయ గలిగాం. కథలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్‌ అవుతారని ఆశిస్తున్నాను’అని అన్నారు. ‘సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా సినిమాని తీర్చిదిద్దాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథ సాగుతుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం. ఓ మంచి కథతో సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది’ అని నిర్మాత నంది వెంకట్‌ రెడ్డి చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version