Home ఇంకా సేనాని (senani.net): రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న.. బంగారం ధరలు

సేనాని (senani.net): రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న.. బంగారం ధరలు

0
Senani (senani.net): Gold prices are hitting record highs.
Senani (senani.net): Gold prices are hitting record highs.

15 Oct 2025 (senani.net):హైదరాబాద్‌: బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరుగుతూ.. పసిడి ప్రియులకు బంగారం చుక్కలు చూపిస్తోంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబం వారు బంగారం అనే మాట కూడా ఎత్తడానికి వీలు లేకుండా.. బంగారం ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. వివరాల్లోకి వెళితే.. ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,836 గా ఉంది, అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,766 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.9,627గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,28,360, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,660, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 96,270గా ఉంది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గోల్డ్‌కు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. రోజురోజుకు భారీగా పెరుగుతూ.. సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. బంగారంతో పాటు.. సిల్వర్‌ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్‌, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ధరలు మారుతుంటాయి. పసిడి పరుగులకు అంతర్జాతీయంగా పలు పరిణామాలు కారణం అవుతాయి. అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, నిన్న(మంగళవారం) ఒక్కరోజే.. సమారుగా మూడు వేలకు పైగా పెరిగిన విషయం తెలిసిందే.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version