– ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి కలకలం
– కెమికల్ యూనిట్‌లో మంటలు చెలరేగి స్థానికుల్లో ఆందోళన
– సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
– పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
– అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణహాని లేదు
14 Oct 2025 (senani.net): ప్రమాదానికి గల అసలు కారణంపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ఒక కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో మంగళవారం తెల్లవారురaామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ పరిసరాల్లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంతో దట్టమైన పొగ వ్యాపించింది. అక్కడి కార్మికులు, స్థానికులు ఆందోళన చెంది వెంటనే పోలీసులకు, ఫైరుసిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక దళం సత్వర చర్య తీసుకుని అనేక ఫైరింజన్‌లను వినియోగించి మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ప్లాంట్‌లోని పరికరాలు, నిల్వ ఉంచిన కెమికల్ పదార్థాలు కాలిపోయాయి. ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణమా, లేక కెమికల్ రియాక్షన్ వల్ల మంటలు చెలరేగాయా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న అంశంపై కూడా పరిశీలన జరుగుతోంది.
