| హైలైట్: |
|
సేనాని (senani.net): October 23, 2025 :శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక పలకలను ఆయన అధికారిక రికార్డుల్లో రాగి పలకలుగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత పారదర్శక టెండర్లు లేకుండా మరమ్మతులకు అప్పగించారని తేల్చారు. ఇక శబరిమల గోల్డ్ స్కామ్‌పై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు.. దీనిపై సరైన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
