Home ఇంకా సేనాని (senani.net): హర్యానాలో కలకలం.. పూరన్‌ కేసులో మరో ట్విస్ట్‌

సేనాని (senani.net): హర్యానాలో కలకలం.. పూరన్‌ కేసులో మరో ట్విస్ట్‌

0
Senani (senani.net): Uproar in Haryana.. Another twist in the Pooran case
Senani (senani.net): Uproar in Haryana.. Another twist in the Pooran case

– పూరన్‌పై అవినీతి ఆరోపణలు.. దర్యాప్తు చేస్తున్న ఏఎస్సై ఆత్మహత్య
– గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న సందీప్‌ కుమార్‌
– చివరికి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు
– ‘‘అతనొక భారీ అవినీతి అధికారి… సత్యం బయటపడుతుందనే భయం’’ : సందీప్‌ ఆరోపణ
14 Oct 2025 (senani.net): హర్యానా రాష్ట్రంలో అదనపు డీజీపీ వై పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య కేసు చుట్టూ రాజకీయ, పరిపాలనా ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. పూరన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ దర్యాప్తు చేపట్టిన రోహ్తక్‌ సైబర్‌ సెల్‌ ఏఎస్సై సందీప్‌ కుమార్‌ మంగళవారం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది.
చావుకు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసిన సందీప్‌ అందులో పూరన్‌ కుమార్‌ను నేరుగా టార్గెట్‌ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘‘పూరన్‌ అవినీతికి కొత్త నిర్వచనం. అతని చేతిలో సిస్టమ్‌ పూర్తిగా కుళ్లిపోయింది. అతనిపై ఉన్న కేసు నిజమని బయటకు రావొస్తోంది… అందుకే భయపడి పూరన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను సత్యం కోసం జీవితం త్యాగం చేస్తున్నాను’’ అని వీడియోలో వెల్లడిరచారు. ఈ ఘటనతో హర్యానాలో పోలీస్‌ విభాగం తీవ్ర ఆందోళనలో పడిరది. వరుస ఆత్మహత్యలతో పూరన్‌ కేసుకు కొత్త మలుపు తిరిగినట్లు స్థానిక మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ రెండూ ఆత్మహత్య కేసులు కలిసి విపరీతమైన దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version