Home ఇంకా సేనాని (senani.net):టోకు ద్రవ్యోల్బణం స్వల్ప తగ్గుదల

సేనాని (senani.net):టోకు ద్రవ్యోల్బణం స్వల్ప తగ్గుదల

0
Senani (senani.net): Second consecutive day of losses.. These are the top stocks today..
Senani (senani.net): Second consecutive day of losses.. These are the top stocks today..

14 Oct 2025 (senani.net): సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. టోకు ధరల సూచిక 0.13 శాతానికి తగ్గిందని మంగళవారం కేంద్రం విడుదల చేసిన డేటా పేర్కొంది. ఆగస్టులో టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం 0.52 శాతంగా ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో 1.91 శాతంగా ఉందని నివేదిక చెప్పింది. టోకు ద్రవ్యోల్బణంలో సానుకూల ధోరణికి ఆహార ఉత్పత్తులు, ఆహారేతర వస్తువులు, రవాణా, దుస్తుల తయారీ ధరలు పెరగడమే కారణమని పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టోకు ధరల సూచిక డేటా ప్రకారం.. ఆగస్టులో ఆహార ధరలు 3.06 శాతంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 5.22 శాతం తగ్గాయి. అదే కాలంలో కూరగాయల ధరలు కూడా తగ్గాయి. ఆగస్టులో 14.18 శాతంతో పోలిస్తే.. సెప్టెంబర్‌లో కూరగాయల ధరలు 24.41 శాతం చేరాయి. ఆగస్టులో 2.55 శాతంతో పోలిస్తే తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.33 శాతానికి తగ్గింది.
రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని ట్రాక్‌ చేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల ప్రారంభంలో తన బెంచ్‌మార్క్‌ పాలసీ రేట్లను 5.5 శాతం వద్ద మార్చలేదు. సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి 1.5 శాతానికి పడిపోయింది. ఆహార ఉత్పత్తులు, ఆహారేతర వస్తువులు, రవాణా పరికరాలు, దుస్తుల తయారీ ధరల పెరుగుదల కారణంగా సెప్టెంబర్‌ 2025 లో టోకు ద్రవ్యోల్బణంలో సానుకూల ధోరణి ఉందని పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హోల్‌ సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ డేటా ప్రకారం.. ఆగస్టులో 3.06 శాతంతో పోలిస్తే.. సెప్టెంబర్‌లో ఆహార ధరలు 5.22 శాతం తగ్గాయి. కూరగాయల ధరలు కూడా ఇదే కాలంలో తగ్గాయి. కూరగాయల ధరలు ఆగస్టులో 14.18 శాతంతో పోలిస్తే.. సెప్టెంబర్‌ లో 24.41 శాతం తగ్గాయి. తయారైన ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఆగస్టులో 2.55 శాతంతో పోలిస్తే.. 2.33 శాతానికి తగ్గింది. ఇంధనం, విద్యుత్‌ రంగాల్లో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.58 శాతంగా నమోదైంది. ఇది అంతకుముందు నెలలో ఇది 3.17 శాతంగా ఉన్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన బెంచ్‌మార్క్‌ పాలసీ రేట్లను ఈ నెల ప్రారంభంలో 5.5 శాతం వద్దే యథావిధిగా కొనసాగించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి 1.5 శాతానికి పడిపోయిందని సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడిరచాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో గణనీయంగా తగ్గి 1.54 శాతానికి చేరుకుంది. గడిచిన ఎనిమిదేళ్లలో ఇదే కనిష్టం. అంతకుముందు నెలలో ఇది 2.07 శాతంగా నమోదైంది. కూరగాయలు, పప్పులతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉండడం ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణమని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏకంగా 5.49 శాతంగా ఉన్నది. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో %-%2.28 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మరుసటి ఆరు నెలల ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బీఐ తగ్గించిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు, ఖరీఫ్‌లో అధిక సాగు, రిజర్వాయర్లలో భారీగా నీరు ఉండడం, ధాన్యాల బఫర్‌ స్టాక్‌ కారణంగా ఆహార ఉత్పత్తులు అదుపులోనే ఉంటాయని అంచనా వేసింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version