Home దేశాల వార్తలు అంతర్జాతీయం సేనాని (senani.net): స్కూల్‌లో దాక్కున్న దుర్మార్గం

సేనాని (senani.net): స్కూల్‌లో దాక్కున్న దుర్మార్గం

0

– టాయిలెట్‌లో బాలికపై లైంగిక దాడి
– స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగింపు
13 Oct 2025 (senani.net): రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన ప్రజలను కలచివేసింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం సమయంలో ఒక మధ్యవయస్కుడు గోడ దూకి లోపలకు ప్రవేశించాడు. అక్కడ ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు అతడు నేరుగా స్కూల్‌ పరిసరాల్లోని టాయిలెట్‌లో దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత టాయిలెట్‌కు వచ్చిన ఏడేళ్ల చిన్నారి బాలికపై ఆకస్మికంగా దాడి చేసి లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆకస్మిక దాడితో భయపడిన బాలిక ప్రాణం తోడూ కేకలు వేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక అరుపులు విన్న స్కూల్‌ సిబ్బంది, అక్కడ ఉన్న ఇతర విద్యార్థులు ఆ దిశగా పరుగెత్తారు. తమపై ప్రమాదం రావచ్చనే భయంతో నిందితుడు స్కూల్‌ గోడ దూకి పారిపోవడానికి యత్నించాడు. అయితే స్థానికులు, సిబ్బంది వెంటపడి అతడిని పట్టుకున్నారు. అదే సమయంలో టీచర్లు ఘటనను తెలుసుకుని వెంటనే బాలికను సురక్షిత స్థలానికి మార్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయడంతో, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తి వయసు 35 ఏళ్లు అని అధికారులు తెలిపారు. బాలికపై వైద్య పరీక్షలు నిర్వహించగా, దాడి జరిగినట్టు నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడిరచాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘోర ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. స్కూల్‌లకు భద్రతా గార్డులు, సీసీ కెమెరాలు, గేట్ల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు తప్పనిసరి చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై ప్రభుత్వమే ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. ఇలాంటి సంఘటనలు తరచూ ఎదురవుతుండటంతో, ‘‘స్కూల్‌ అనేది చదువు చెప్పే స్థలం మాత్రమే కాదు, పిల్లలు భద్రంగా ఉండాల్సిన ప్రదేశం కూడా’’ అనే ప్రశ్న మరోసారి ప్రజల్లో ప్రతిధ్వనిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version