– విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
– రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ మెగా ప్రాజెక్ట్
– కేంద్ర, రాష్ట్ర కీలక నాయకుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్
– ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండిరగ్
14 Oct 2025 (senani.net): టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొత్త మైలురాయి చేరినట్లైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో భారీ స్థాయి ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, విశాఖ భారతదేశ ఏఐ మ్యాప్‌లో మాత్రమే కాక ఆసియా స్థాయిలో కీలక టెక్ డెస్టినేషన్‌గా నిలిచే అవకాశం ఏర్పడిరది. ఈ డేటా సెంటర్ కోసం సుమారు రూ.1.33 లక్షల కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. పెట్టుబడి పరంగా ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద టెక్నాలజీ ఒప్పందంగా భావిస్తున్నారు. డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ సర్వీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత అంతర్జాతీయ సేవలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉండనుంది.
ఢల్లీిలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రత్యక్షంగా హాజరై ప్రాజెక్టు దిశగా ఉన్న సంస్థ ప్రణాళికలను వివరించారు. ఈ హాజరు ప్రాజెక్టుపై కేంద్ర-రాష్ట్ర సంయుక్త నిబద్ధతను సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కనెక్టివిటీ పెరిగి, స్టార్టప్స్, టెక్ ఇన్నోవేషన్‌కు ఊతం లభించనుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఏఐ ఆధారిత కొత్త సేవలు, ఇన్నోవేటివ్ ప్రాజెక్టులకు విశాఖ కేంద్రంగా మారే అవకాశాన్ని యువత గొప్ప ఆశగా చూస్తోంది. టెక్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా టాప్ ట్రెండిరగ్‌లో నిలిచింది. గూగుల్ పెట్టుబడితో రాష్ట్రం రూపుదిద్దుకోబోతున్న ఈ మార్పును నెటిజన్లు హర్షంతో స్వాగతిస్తున్నారు. ‘‘విశాఖ ఏఐ క్యాపిటల్‌గా మారబోతోంది’’ అన్న కామెంట్లు విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
