– కాలనీ ప్రజలతో మీనాక్షి నటరాజన్ టీ అల్పాహారం
14 Oct 2025 (senani.net): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని మోతీనగర్ రాయుడు హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చురుకుగా కొనసాగింది. పార్టీ ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ స్థానిక కార్యకర్తలతో కలిసి కాలనీ ప్రజల మధ్యకు వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా కార్యక్రమానికి హాజరై ప్రజలతో టీ, అల్పాహారం తీసుకుంటూ మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పులను నాయకులు వివరించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విన్న నేతలు, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎర్రగడ్డ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రతి కార్యకర్త బలం చేకూర్చాలని నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, యువ శ్రేణులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార యాత్రకు ప్రజలు కూడా విశేష స్పందన ఇచ్చారు.
