Home క్రీడలు సేనాని (senani.net): క్రిస్టియానో రోనాల్డో కొత్త చరిత్ర.. వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో అగ్రస్థానంలో

సేనాని (senani.net): క్రిస్టియానో రోనాల్డో కొత్త చరిత్ర.. వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో అగ్రస్థానంలో

0
Senani (senani.net): Cristiano Ronaldo creates new history.. tops the World Cup qualifiers
Senani (senani.net): Cristiano Ronaldo creates new history.. tops the World Cup qualifiers

15 Oct 2025 (senani.net): ఫుట్‌బాల్‌ చరిత్రలో తన పేరు మరింత బంగారు అక్షరాలతో లిఖించుకున్నాడు క్రిస్టియానో రోనాల్డో. 2026 వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్‌ తరఫున ఆడుతున్న ఈ సూపర్‌స్టార్‌ ఇప్పటి వరకు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లలో మొత్తం లిలి41 గోల్స్‌లిలి నమోదు చేసి మునుపటి రికార్డును అధిగమించాడు. లిస్బన్‌లోని ఇస్టాడియో జోష్‌ అల్వలేడ్‌ స్టేడియంలో హంగేరితో జరిగిన మ్యాచ్‌ ఈ చారిత్రక క్షణానికి వేదికైంది. ఆ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసినా, రోనాల్డో ఒక్కరే రెండు గోల్స్‌ చేసి తన క్లాస్‌ ఏంటో మళ్లీ చాటాడు. దీతో క్వాలిఫయింగ్‌ చరిత్రలో 40 గోల్స్‌ మార్క్‌ దాటి తొలి ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు గ్వాటెమాలా ఆటగాడు కార్లో రూయిజ్‌ ఈ రికార్డు పేరిట నిలిచాడు. అతను 39 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు రోనాల్డో అతడిని అధిగమించి శిఖరాన్ని అందుకున్నాడు. గణాంకాల ప్రకారం.. రోనాల్డో ఆట శైలిలో ఇప్పటికీ అదే దూకుడు కనిపించడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఇప్పటికీ పోర్చుగల్‌ జట్టు అధికారికంగా వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించలేదు. నవంబర్‌ 14న ఐర్లాండ్‌తో కీలక మ్యాచ్‌ ఉండగా.. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రోనాల్డో సేన తన టికెట్‌ ఖాయం చేసుకోవచ్చు. అయితే వ్యక్తిగతంగా మాత్రం రోనాల్డో మళ్లీ అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ తన స్థాయి ఏంటో ప్రపంచానికి గుర్తు చేశాడు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version