Home క్రీడలు సేనాని (senani.net): శివం దూబేకు గాయం.. ఆసీస్‌ టూర్‌పై సందేహాలే?

సేనాని (senani.net): శివం దూబేకు గాయం.. ఆసీస్‌ టూర్‌పై సందేహాలే?

0
Senani (senani.net): Shivam Dubey injured.. doubts about the Aussie tour?
Senani (senani.net): Shivam Dubey injured.. doubts about the Aussie tour?

15 Oct 2025 (senani.net): టీమిండియా ఆల్‌రౌండర్‌ శివం దూబే యాదృచ్ఛికంగా వెనక్కి తిరిగి రావడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ముంబై జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడేందుకు జమ్మూకు చేరిన దూబే ప్రాక్టీస్‌ సమయంలోనే వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. అక్కడి చలికాలం పరిస్థితులు అతనికి అసౌకర్యం కలిగించాయని సమాచారం. గాయం తీవ్రం కాకముందే జట్టు మేనేజ్‌మెంట్‌ జాగ్రత్తగా వ్యవహరించి అతన్ని తిరిగి ముంబైకి రప్పించింది. ఆసీస్‌ టూర్‌కు ఇంకా కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో శివం దూబే ఆరోగ్యం కీలకంగా మారింది. అక్టోబర్‌ 29 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు అతను జట్టులో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి మెడికల్‌ టీమ్‌ సంపూర్ణ విశ్రాంతి సూచించింది. జట్టు స్ట్రాటజీలో కీలక పాత్ర పోషించగలిగే దూబే ఇలా చివరి క్షణంలో గాయపడ్డాడు అన్న ఆలోచన అభిమానులను కలవరపెడుతోంది. ముంబై జట్టు అధికారులు మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ వారం చివరికల్లా దూబే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గాయం స్వల్పంగానే ఉందని, విశ్రాంతి తీసుకుంటే తిరిగి మైదానంలో అడుగుపెట్టగలడని అంచనా. అయితే అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సమీక్ష తరువాతే తెలుస్తుంది. ప్రస్తుతం భారత జట్టులో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా దూబే స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పవర్‌ హిట్టింగ్‌ సామర్థ్యం, డెత్‌ ఓవర్లలో బంతితో ప్రభావం చూపగల నైపుణ్యం ఉన్న అతను సిరీస్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఈ గాయం విషయంపై అందరి దృష్టి ఉంది. %నఱం టఱ్‌అవంం% మళ్లీ సరిగా అయ్యేలా ఆశాభావంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎదురు చూస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version