Home సినిమా సేనాని (senani.net): ఆ పదం అర్థం తెలియదు..

సేనాని (senani.net): ఆ పదం అర్థం తెలియదు..

0
Senani (senani.net): I don't know the meaning of that word..
Senani (senani.net): I don't know the meaning of that word..

14 Oct 2025 (senani.net):రాశీ ఖన్నా వివరణతో కలకలం 
తెలుసు కదా’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రాశీ ఖన్నా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆమె వాడిన ఓ బూతు పదం క్లిప్‌ వైరల్‌ అవ్వడంతో, నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా తాజాగా స్పందిస్తూ స్పష్టతనిచ్చారు.
వివాదానికి కారణమైన వ్యాఖ్య : సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ, అతని స్టైల్‌, కాన్ఫిడెన్స్‌ గురించి మాట్లాడుతుండగా, లిలి‘‘ఆయన్ని చూస్తే నేను ఒక లిపిచ్చి ములిలిలాలి ఫీలయ్యా’’లిలి అని చెప్పింది. ఈ పదం బూతు అని భావించి సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు లిలి‘‘తెలుగు వచ్చి మాట్లాడకపోతే అర్థం చేసుకోవాలి, బూతులు వాడడం ఎందుకు?’’ అంటూ విమర్శలు గుప్పించారు.
రాశీ ఇచ్చిన క్లారిటీ : ఇప్పుడు ఈ విమర్శలకు స్పందించిన రాశీ, లిలి‘‘నాకు ఎంత మాత్రం దురుద్దేశం లేదు. ఆ పదం క్యూట్‌ స్లాంగ్‌లా అనిపించింది. బూతు పదమని అసలు తెలియదు. నా ఫ్రెండ్‌ చెప్పాకనే తెలుసుకున్నాను. నేను ఎవరినీ హర్ట్‌ చేయాలనుకోలేదు’’లిలి అని ఆమె తెలిపింది.
సిద్ధు సపోర్ట్‌ : హీరో సిద్ధు కూడా ఆమెకు మద్దతు పలికాడు. లిలి‘‘మా సినిమాలో ఓ బామ్మ పాత్ర ఆ పదాన్ని కామెడీగా మాట్లాడుతుంది. అదే వినిపించి రాశీ నిర్లక్ష్యంగా చెప్పింది. ఆమెకు అసలు అర్థం తెలియదు’’లిలి అని చెప్పాడు. సోషల్‌ మీడియా రియాక్షన్‌ రాశీ వివరణ ఇచ్చినా.. కొందరు నెటిజన్లు లిలి‘‘తెలియకపోతే మాట్లాడకూడదు’’లిలి అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘‘పదాలు ఎందుకు ఇంత సీరియస్‌ అవుతున్నారు? కామెడీగా అనేసింది’’లిలి అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతలోనే ‘తెలుసు కదా’ టీమ్‌ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేయగా, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version