Home సినిమా సేనాని (senani.net): ‘తెలుసుకదా’ ట్రైలర్‌కి యూత్‌ రెస్పాన్స్‌ హై

సేనాని (senani.net): ‘తెలుసుకదా’ ట్రైలర్‌కి యూత్‌ రెస్పాన్స్‌ హై

0
Senani (senani.net): Youth response to the trailer of ‘Telusukada’ is high
Senani (senani.net): Youth response to the trailer of ‘Telusukada’ is high

14 Oct 2025 (senani.net): ట్రైలర్‌తో ఆడియన్స్‌కి ఒక్కసారిగా బ్యాంగ్‌ లాంటిది ఇవ్వాలని ముందే డిసైడ్‌ అయ్యాం. ట్రైలర్‌లో మీరు ఏదైతే చూశారో.. అదే క్యారెక్టర్‌, అదే టోన్‌ సినిమాలోనూ కనిపిస్తుంది. టిల్లు లాంటి క్యారెక్టర్‌ నుంచి బయటకు రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. టిల్లు ఇన్నోసెంట్‌. బట్‌.. ‘తెలుసు కదా’లో వరుణ్‌ అలా కాదు. వాడు ఇంటెలిజెంట్‌. ఇందులో వరుణ్‌గా కావాల్సినంత వినోదాన్నిస్తా. యూత్‌కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చే సినిమా ఇది.’ అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘తెలుసు కదా’. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలు. నీరజా కోనా దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఇదొక రాడికల్‌ మూవీ అనీ, ఈ సినిమా చూశాక సిద్ధూని టిల్లూగా మరిచిపోతారని రాశీఖన్నా చెప్పారు. ‘ఇది నా ఫస్ట్‌ ఫిల్మ్‌. నాకు చాలా స్పెషల్‌. ట్రైలర్‌లో చూసిన దానికి పదిరెట్లు సినిమాలో ఉంటుంది.’ అని నీరజా కోనా నమ్మకం వెలిబుచ్చారు. యూత్‌కి విపరీతంగా నచ్చే సినిమా ఇదని నిర్మాతల్లో ఒకరైన కృతి ప్రసాద్‌ అన్నారు. ఇంకా వైవా హర్ష, మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు. మేల్‌ ఇగో, మోడరన్‌ ఎమోషన్‌తో కూడిన ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ ఇదని ట్రైలర్‌ చెబుతున్నది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version