Home క్రీడలు సేనాని (senani.net): యశస్వి -గిల్‌ ఓపెనింగ్‌ అయితే రోహిత్‌ను మర్చిపోతారు’’ – ఆకాశ్‌ చోప్రా

సేనాని (senani.net): యశస్వి -గిల్‌ ఓపెనింగ్‌ అయితే రోహిత్‌ను మర్చిపోతారు’’ – ఆకాశ్‌ చోప్రా

0
Senani (senani.net): If Yashasvi-Gill open, Rohit will be forgotten - Aakash Chopra
Senani (senani.net): If Yashasvi-Gill open, Rohit will be forgotten - Aakash Chopra

14 Oct 2025 (senani.net): టీమిండియాలో తరం మార్పు వేగం పెరిగింది. సీనియర్ల స్థానాలకు యువ క్రీడాకారులు గట్టిగా ఢీ కొడుతున్నారు. ఆసియా కప్‌లో ఘనంగా రాణించిన అభిషేక్‌ శర్మను రోహిత్‌ శర్మకు వారసుడిగా భావించినప్పటికీ, సెలెక్టర్లు మాత్రం వేచి చూడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
అభిషేక్‌ కాదు – యశస్వి ముందే ఉన్నాడు!
టెస్ట్‌ క్రికెట్‌లో ఇప్పటికే ఓపెనర్‌గా తన స్థానాన్ని దక్కించుకున్న యశస్వి జైస్వాల్‌ వెంటనే వన్డేలకు కూడా ఫిట్‌ అవుతాడని ఆకాశ్‌ స్పష్టం చేశాడు. రోహిత్‌కు నిజమైన రీప్లేస్‌మెంట్‌గా యశస్వికే ముందుగా అవకాశం రావాలని అన్నారు.
గిల్‌ – యశస్వి ఓపెనింగ్‌ అయితే రోహిత్‌ను మర్చిపోతారా?
‘‘శుభ్‌మన్‌ గిల్‌తో పాటు యశస్వి ఓపెనింగ్‌ చేస్తే, ఆ కాంబినేషన్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాంటి స్టార్టింగ్‌ ముందు రోహిత్‌ లేని లోటు కూడా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు’’ అని ఆకాశ్‌ చోప్రా విశ్లేషించాడు. అభిమానులు అంగీకరించకపోయినా, టీమిండియాలో భవిష్యత్‌ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
2026 తర్వాత భారీ మార్పులు
ఇక 20ల్లో కూడా 2026 వరల్డ్‌ కప్‌ తర్వాత ఓపెనింగ్‌ స్లాట్‌లో భారీ మార్పులు తప్పవని చెప్పారు. యశస్వి, అభిషేక్‌ ఇద్దరూ ఓపెనర్లుగా వచ్చి, గిల్‌ను నంబర్‌-3కి పంపే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఆసీస్‌ సిరీస్‌ – నిజమైన అగ్నిపరీక్ష
రాబోయే ఆస్ట్రేలియా టూర్‌ రెండు తరాల మధ్య పోటికి వేదిక కానుంది. రోహిత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం కాగా, యశస్వికి ఇది కెరీర్‌ మలుపు. ఒకరికొకరు ఛాలెంజ్‌గా మారిన ఈ పోటీ భారత క్రికెట్‌ భవిష్యత్తును నిర్ణయించనుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version